హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): గోల్డెన్ జూబ్లీహిల్స్ హోటల్ ప్రై వేట్ లిమిటెడ్ (ట్రైడెంట్) దివాలా ప్రక్రియ వివాదం కోర్టుల్లో తేలినా మళ్లీ అదే అంశంపై పిటిషన్ దాఖలు చేసిన మహా హోటల్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీరును హైకోర్టు గురువారం తప్పుబట్టింది. ఎన్సీఎల్టీ నుంచి సుప్రీంకోర్టు దాకా తేలిన అంశాల మీద మళ్లీ పిటిషన్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
వ్యర్థ పిటిషన్లతో కో ర్టు సమయాన్ని వృథా చేసినందుకు 10 లక్షలు జరిమానాను ప్రధాన మంత్రి సహాయక నిధికి చెల్లించాలని మహా హోటల్స్‌ను ఆదేశించింది.