హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలో మరో ఉద్యాన కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలంగాణ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ దండా రాజిరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో తెలంగాణ ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాశాలను గురువారం ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాంతంలోని రైతాంగానికి శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల సేవలు, సూచనలు, సలహాలు అం దించడానికి ఈ కళాశాల ఎంతగానో దోహ దం చేస్తుందని తెలిపారు.
కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ఉద్యాన పంటలను మరింత విస్తరించేందుకు, రైతులకు మెరుగైన సేవలందించడానికి ఈ కళాశాల వేదిక కానున్నదని ఆశాభావం వ్య క్తంచేశారు. ఈ విద్యా సంవత్సరం 2026-27 నుంచి 30 సీట్లతో బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్లో అడ్మిషన్లు జరుగనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎప్సెట్లో మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఇందులో అడ్మిషన్ పొందుతారని వివరించారు.