నెక్కొండ, డిసెంబర్ 3 : సా గు, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక వరంగల్ జిల్లాలో మంగళవారం ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నె క్కొండ మండలం దీక్షకుంటకు చెందిన తోట సంపత్ (47)కు ముగ్గురు కొడుకులు. వారి చదువులు, ట్రాక్టర్ కొనుగోలు కు రూ. 20 లక్షల వరకు అప్పు అయ్యింది. వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగాడు.
టుంబసభ్యులు నర్సంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించగా, మంగళవారం ఉదయం మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తె లిపారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రభుత్వ దవాఖానకు వెళ్లి రైతు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే రైతు కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.