చేగుంట, జూన్ 19: అప్పుల బాధ తో యువ రైతు ఆత్మహ త్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండ లం రుక్మాపూర్‌లో చో టుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మాపూర్‌కు చెందిన నా గారం శ్రీకాంత్ (26) తనకున్న ఎకరన్నరలో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయం బోర్లు , ఇతర అ వసరాల కోసం రూ.8 లక్షల వరకు అ ప్పు చేశాడు.
వాటిని ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో గురువారం ఆయన వ్యవసా య పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చేగుంట ఎస్సై చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.