Heavy Rains | బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్!
Heavy Rains | బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన వాతావరణం ఏర్పడినట్టు వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 23, 24తేదీల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకొని ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని వెల్లడించింది.
Heavy Rains | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన వాతావరణం ఏర్పడినట్టు వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 23, 24తేదీల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకొని ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని వెల్లడించింది. ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయని పేర్కొన్నది. దీంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది.
ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడటానికి అనువైన పరిస్థితులు నెలకొనడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వెల్లడించారు.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నదని వెల్లడించారు. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

