HCU | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): హెచ్సీయూలో తాజాగా మరో జింక గాయపడింది. సౌత్ క్యాంపస్ జేకే మెస్ వెనుకవైపున వేటగాళ్లు అమర్చిన వలలో జింక చిక్కుకున్నది. దీంతో కుక్కలు దానిపై దాడి చేసి గాయపరిచాయి. సెక్యూరిటీ సిబ్బంది శనివారం సాయంత్రం వలను, అందులో జింకను గమనించారు. పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు.
సంబంధిత అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని జింకకు ప్రాథమిక చికిత్స చేసి, సంరక్షణ కోసం జూపార్కుకు తరలించారు. హెచ్సీయూ పరిధిలోని అడవిలో జంతువుల వేట నిత్యకృత్యమైందని విద్యార్థులు చెప్తున్నారు. క్యాంపస్ చుట్టూ ప్రభుత్వం సెక్యూరిటీని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.