హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : 2015 తర్వాత పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. చదువు మధ్యలో ఆగిపోయిన వారు పదిలో ఉత్తీర్ణత అయ్యేందుకు జూన్-2026లో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇది కేవలం కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్ (సీసీఈ) పద్ధతిలో పరీక్షలు రాసిన వారికి మాత్రమే ఈ అనుమతి వరిస్తుందని పేర్కొన్నది.