శేరిలింగంపల్లి, డిసెంబర్ 7: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పై మరో కేసు నమోదైం ది. మాసబ్‌ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురాం పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించారని, చనిపోతానని బెదరించారన్న ఆరోపణలతో శనివారం గచ్చిబౌ లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కోర్టు అనుమతితో బీఎన్ఎస్ 220, 226 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యా ప్తు చేపట్టిన ట్టు ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు.