నాంపల్లి కోర్టులు, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును మరో కేసులో 10రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు నిందితుడి తరఫు న్యాయవాదికి నోటీసులు జారీచేసింది. రాధాకిషన్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు పీపీని ఆదేశించింది. తనకు సమయం కావాలని పీపీ కోరడంతో.. రెండు కేసులను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులను సొంత రాష్ర్టాలకు పంపించాలని నాన్ లోకల్ టీచర్స్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ కోరింది. విభజన సమస్యలపై శనివారం ఇద్దరు సీఎంల సమావేశం నేపథ్యంలో సొంతరాష్ర్టాలకు పంపించాలని అసొసియేషన్ అధ్యక్షుడు మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి వీ సూర్యనారాయణ కోరారు.