దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను నిరసిస్తూ హైదరాబాదులో గురువారం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, టీయూడబ్ల్యూజే, దాని అనుబం ధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
- ఐజేయూ, టీయూడబ్ల్యూజే సభలో వక్తల ఆందోళన
- ఢిల్లీలో మీడియా సంస్థలపై దాడులకు ఖండన
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను నిరసిస్తూ హైదరాబాదులో గురువారం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, టీయూడబ్ల్యూజే, దాని అనుబం ధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ సర్కిల్లో ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. కేంద్రం అప్రకటిత ఎమర్జెన్సీని అమలుచేస్తూ మీడియా మీద, పౌర సంస్థల మీద ఉక్కుపాదం మోపుతున్నదని మండిపడ్డారు.
న్యూస్‌క్లిక్ పోర్టల్ కార్యాలయం పై, అందులో పనిచేస్తున్న 47 మంది జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు దాడులు జరిపిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తున్నదని అన్నారు. కఠినమైన ఉపా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్న పోలీసులు ముందుగా ఎఫ్ఐఆర్ ఎం దుకు దాఖలు చేయడం లేదో చెప్పడం లేదని వాపోయారు. కారణం చెప్పకుం డా అరెస్టు చేయడం ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమేనని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే సుదర్శన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇందిరా గాంధీ హయాంలో 1975లో ప్రకటిత ఎమర్జె న్సీ అమలు కాగా నేడు మోదీ పాలనలో అదే రీతిలో ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మానవ హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ దేశంలో కొనసాగుతున్న నిర్బంధకాండ ప్రమాదకర పరిస్థితులను సూచిస్తున్నదని వ్యాఖ్యానించారు. స్వే చ్ఛ లేని బతుకు అర్థరహితమని, దాన్ని కాపాడాల్సిన ప్రభు త్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దురదృష్టకరమని అన్నారు. ప్రముఖ పాత్రికేయుడు కే రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వాతంత్య్రంపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించడానికి జర్నలిస్టులంతా సమైక్య పోరాటం సాగించాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పారు.
నగరంలో గర్జించిన జర్నలిస్టులు
మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వ ఉక్కుపాదాన్ని నిరసిస్తూ, గురువారం హైదరాబాద్‌లో జర్నలిస్టులు గర్జించారు.ఐజేయూ, టీయూడబ్ల్యూజే నేతత్వంలో, హెచ్‌యూజే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్, నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఇండియా, తెలంగాణ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ చిన్న, మధ్యతరహా పత్రికలు, మ్యాగజైన్స్ అసోసియేషన్ల భాగస్వామ్యంతో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. బషీర్‌బాగ్‌లోని టీయూడబ్ల్యూజే కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ సర్కిల్‌కు చేరుకుంది. ఆయా ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు సంఘీభావం
ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

