నవీపేట, నవంబర్ 17: ఫైనాన్స్ కిస్తీలు కట్టలేక మరో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మోకన్‌పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన టేకు కర్ణ (35) ఉపాధి కోసం రెండేండ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లి వచ్చాడు. కుటంబ పోషణ కోసం ఫైనాన్స్‌లో అప్పు చేసి ప్యాసింజర్ ఆటో కొనుగోలు చేశాడు. ఓ వైపు ఆటో సరిగ్గా నడవక ఫైనాన్స్‌లో తీసుకున్న అప్పులకు నెలనెలా కిస్తీలు సక్రమంగా కట్టక ఇబ్బందులు పడుతున్నాడు.
మరోవైపు ఫైనాన్స్ నిర్వాహకులు కిస్తీలు కట్టాలంటూ కర్ణపై ఒత్తిడి చేస్తు న్నా. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పు లు తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెం దాడు. ఆదివారం బంధువుల పెండ్లి ఉండటంతో ముం దుగా భార్య, పిల్లలను పంపించాడు. అనంతరం కర్ణ ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యా దు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి నలుగురు పిల్లలు, భార్య పుష్ప ఉన్నారని, కేసు దర్యాప్తులో ఉందని స్థానిక ఎస్సై వినయ్ తెలిపారు.