మరో 2 వేల కోట్ల అప్పు.. బాండ్ల వేలం ద్వారా తెచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం
రాష్ట్రాన్ని రుణాల ఊబిలో దింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అప్పుల బాట పట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.2 వేల కోట్ల రుణాన్ని సమీకరించింది.
- ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మూడు దఫాలుగా
- ఆర్బీఐ నుంచి రూ.10,900 కోట్ల రుణ సమీకరణ
- నిరుటి అంచనా కంటే 44% అధికంగా అప్పులు
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రాన్ని రుణాల ఊబిలో దింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అప్పుల బాట పట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.2 వేల కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇందులో 7 సంవత్సరాల కాలపరిమితితో 7.74% వార్షిక వడ్డీకి రూ.750 కోట్లు, 11 ఏండ్ల్ల కాలపరిమితితో 7.84% వడ్డీకి రూ.500 కోట్లు, 21 ఏండ్ల కాలపరిమితితో 7.91% వడ్డీకి రూ.750 కోట్లు సేకరించింది.
ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి రేవంత్‌రెడ్డి సర్కార్ అప్పులు తీసుకోవడం ఇది నాలుగోసారి. దీనితో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన మొత్తం అప్పు రూ.12,900 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్బీఐ నుంచి మొత్తం రూ.18,900 కోట్ల రుణాలు సమీకరించనున్నట్టు రాష్ట్ర బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ నెలలోనే రెండు విడతలుగా రూ.6,900 కోట్లు, ఆ తర్వాత ఈ నెల 5న మరో రూ.4 వేల కోట్లు తెచ్చింది.
అంచనాలకు మించి భారీగా అప్పులు
గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అంచనాలకు మించి భారీగా అప్పులు తెచ్చింది. 2025-26లో బహిరంగ మార్కెట్ నుంచి మొత్తంగా రూ.54,009 కోట్ల రుణాలు తెస్తామని బడ్జెట్లో ప్రకటించినప్పటికీ ఏకంగా రూ.85,840 కోట్ల అప్పులు తెచ్చింది. ఇది బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం కంటే 44% అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.80 వేల కోట్ల రుణాలు సమీకరించనున్నట్టు బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్‌రెడ్డి సర్కార్.. ఈసారి కూడా అంచనాలకు మించి అప్పులు తెచ్చే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ నుంచి తెచ్చిన అప్పులు

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

