హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్న సర్కార్ తాజాగా మరో రూ. 2వేల కోట్ల బకాయిలు విడుదల చేసింది. సోమవారం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ఉద్యోగుల బకాయిలను 100 రోజుల్లో రూ. 6వేల కోట్లు చెల్లిస్తామని సర్కార్ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చింది. మే 29న మొదటి విడతగా రూ. 2వేల కోట్లు విడుదల చేసిన సర్కార్, తాజాగా రెండో విడతలో మరో రూ. 2వేల కోట్లు విడుదల చేసింది.
వీటి విడుదలతో రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ టీచర్ల జీపీఎఫ్ బకాయిలు వందశాతం చెల్లించినట్టు సర్కార్ తెలిపింది. రిటైర్డ్ ఉద్యోగులకు సెప్టెంబర్ 2025 వరకు గల కమ్యూటేషన్ బకాయిలు చెల్లించినట్టు వెల్లడించింది. రూ. 10వేల లోపు గల మొత్తాలు, 5లక్షల టోకెన్లు చెల్లింపులు జరిపినట్టు సర్కార్ వర్గాలు తెలిపాయి.