హైదరాబాద్ : రాష్ట్రంలో మరో 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79కి పెరిగింది. ఇందులో 27 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. 232 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,82,215కు పెరగ్గా.. 6,74,453 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,733 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారినపడి ఇప్పటి వరకు 4,029 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇవాళ 28,886 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.