రుణమాఫీ 11,812 కోట్లు
పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, వాటిని పరిష్కరిస్తూ అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
- ఇప్పటికే 21.35 లక్షల రైతులకు విముక్తి
- తాజాగా మరో 1,000 కోట్లు విడుదల
- వేగంగా జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియ
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, వాటిని పరిష్కరిస్తూ అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రుణమాఫీ కోసం బుధవారం మరో రూ.1,000 కోట్లు విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు 21.35 లక్షల రైతులకు చెందిన రూ.11,812 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఈ మేరకు ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 29.61 లక్షల రైతులకు సంబంధించిన రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆగస్టు 3న ఆ ప్రక్రియను ప్రారంభించింది.
స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న ఒక్కరోజే రూ.5,809 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ఆ ఒక్కరోజే రూ.లక్ష లోపు రుణం ఉన్న 9 లక్షల మంది రైతులు రుణవిముక్తులయ్యారు. ఒక్కొక్క రైతుకు గరిష్ఠంగా రూ.లక్ష చొప్పున మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటివరకు రూ.1.20 లక్షల వరకు రుణాలు పొందిన రైతులు రుణమాఫీ పథకంలో కవర్ అయినట్టు సమాచారం. మిగిలినవారి రుణాలను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. బ్యాంకు ఖాతాల సమస్యలతో తిరస్కరణకు గురైనవాటిని కూడా తిరిగి చెల్లించేలా చర్యలు చేపట్టింది. బ్యాంకర్లతో మాట్లాడిన వ్యవసాయ శాఖ అధికారులు ఆయా సమస్యలను పరిష్కరిస్తున్నారు. త్వరలోనే వీరికి కూడా రుణమాఫీ సొమ్ము జమ కానున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

