పెద్దఅంబర్‌పేట, సెప్టెంబర్ 19: కౌతా అన్నపూర్ణ విశాలాక్షి (62) బ్రెయిన్ స్ట్రోక్‌తో దవాఖానలో చేరి.. ఈ నెల 16న కన్నుమూశారు. కిడ్నీలు, లివర్ దానం చేసి ఆదర్శంగా నిలిచారు. కౌతా శ్రీనివాస్, అన్నపూర్ణ విశాలాక్షి ఆదర్శ దంపతులు. రెండున్నర దశాబ్దాలుగా రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారంలో నివసిస్తున్నారు.
ఈ నెల మొదటి వారంలో విశాలాక్షికి బీపీ పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బంధువుల సాయంతో ఆమెను ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. భర్త శ్రీనివాస్ అంగీకారంతో విశాలాక్షి కిడ్నీలు, లివర్‌ను జీవన్‌దాన్‌కు అందజేశారు. విశాలాక్షి మరణించినా.. అవయవాల దానంతో ఆమె ఎప్పటికీ బతికే ఉంటుందని భర్త పేర్కొన్నారు. అంత్యక్రియలు గురువారం నిర్వహించారు.