హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : సేవా దాతృత్వ కార్యక్రమాల్లో ముందంజలో ఉండే విద్యుత్తు ఉద్యోగి పాపకంటి అంజయ్య మరో అవార్డు అందుకున్నారు. ఆదివారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో సినీనటులు రాజేంద్రప్రసాద్, అలీ చేతుల మీదుగా ఆయన సైమా సోషల్ ఫిలాంత్రఫిస్ట్ అవార్డు అందుకున్నారు. అంజయ్య దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థలో అకౌంట్స్ విభాగం ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
ఆయన విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(వీఏవోఏటీ) ప్రధాన కార్యదర్శిగాను సేవలందిస్తున్నారు. అంజయ్య అనాథలకు మూడు నూతన గృహాలు నిర్మించి ఇచ్చారు. హెల్పింగ్ హ్యాండ్స్, మమత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో జీ టీవీ అవార్డును సైతం అంజయ్య అందుకున్నారు.