హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): గొర్రెల పెంపకం పథకం నిధుల మళ్లింపు కేసును కొట్టేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎం ఆదిత్య కేశవసాయి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
పోలీసులు నమోదు చేసిన కేసు ఏసీబీకి బదిలీ అయ్యిందని, పిటిషనర్‌పై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరగాల్సి ఉన్నదని, ఈ దశలో పిటిషనర్‌కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఆదిత్య కేశవసాయి పిటిషన్‌పై జస్టిస్ మాధవీదేవి విచారణ జరిపారు. గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో డిసెంబర్ 28న కేసు నమోదైంది.