హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎక్కడైనా విపరీతంగా పక్షులు చనిపోతే వెంటనే 9100797300 వాట్సాప్ నెంబర్కు సమాచారం ఇవ్వాలని పశు సంవర్ధక శాఖ కోరింది.
ఏవియన్ ఇన్ఫ్ల్యూయెంజా అనుమానిత కేసులతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.