Minister Seethakka | హైదరాబాద్ : అడ్డగోలు హామీలు, అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదు. పోని ఉన్న సంక్షేమ పథకాలను కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.
రాష్ట్ర మంత్రి సీతక్క ఇలాకాలో అయితే పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. గర్భిణీలు, బాలింతలకు పంపిణీ చేసిన కోడిగుడ్లు మొత్తం కుళ్లిపోయాయి. దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో బాధిత మహిళలు కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ గ్రామంలో అంగన్వాడీ సిబ్బంది గర్భిణిలు, బాలింతలకు కోడిగుడ్లు పంపిణి చేసింది. ఇక లబ్ధిదారులు తమ ఇంటికి వెళ్లి కోడిగుడ్లను పొడిచి చూడగా దుర్వాసన వెదజల్లింది. గుడ్లన్నీ కుళ్లిపోయి పాడై పోయి ఉన్నాయి. ఆ దుర్వాసన భరించలేక రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. గర్భిణి స్త్రీలు, బాలింతలు తినే ఆహారం కూడా నాణ్యంగా అందించలేరా అంటూ లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి సీతక్క ఇలాకాలో గర్భిణీ, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్ గ్రామంలో గర్భిణిలు, బాలింతలకు కోడిగుడ్లు పంపిణి చేసిన అంగన్వాడీ సిబ్బంది
ఇంటికి వెళ్లి చూడగా లబ్ధిదారులకు కనిపించిన కుళ్లిన కోడిగుడ్లు
గర్భిణి స్త్రీలు, బాలింతలు తినే… pic.twitter.com/MV6mEXmufW
— Telugu Scribe (@TeluguScribe) September 12, 2025