కాగజ్నగర్, అక్టోబర్ 28 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ నిజామొద్దీన్కాలనీ చెత్తకుప్పలో మంగళవారం అంగన్వాడీ కోడిగుడ్లు దర్శనమిచ్చాయి. గర్భిణులు, పిల్లలకు అందాల్సిన కోడిగుడ్లు ఇలా పడేయడంపై విమర్శలు వస్తున్నాయి.
తనకు కోడిగు డ్లు అడిగినా ఇవ్వలేదని, గుడ్లు ఇ లా చెత్తకుప్ప పాలు చేయడమేమిటని కాలనీకి ఓ గర్భిణి అసహనం వ్యక్తంచేసింది. సూపర్వైజర్ భా గ్యను సంప్రదించగా లబ్ధిదారులే పడేసినట్టు అంగన్వాడీ టీచర్ ద్వారా తెలిసిందని తెలిపారు.