
ఏపీలోని శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర
కోదాడకు చేరుకున్న వండాన శేఖర్
కోదాడ టౌన్, డిసెంబర్ 14 : తన అభిమాన మంత్రి కేటీఆర్‌ను కలవాలని ఆంధ్రా కు చెందిన ఓ యువకుడు పెద్ద సాహసమే చేశాడు. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్‌కు కాలినడకన వెళ్లి కలవాలని నిర్ణయించుకొని నడక ప్రారంభించాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం సారథి గ్రామానికి చెందిన వండాన శేఖర్‌కు మంత్రి కేటీఆర్ అంటే వీరాభిమానం. ‘అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌కు వందనాలు’ అనే ఫ్లెక్సీతో నవంబర్ 30న తన గ్రామం నుంచి కాలినడకన బయల్దేరాడు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడకు చేరుకున్నాడు.