హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పలువురు రిటైర్డ్ ఉన్నతాధికారులు వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచారు. టీడీపీ తరఫున రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్, గుంటూరు జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీ రామాంజనేయులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి విజయం సాధించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ బాపట్ల నుంచి ఎంపీగా పోటీచేసి విజయం సాధించారు. బీజేపీ తరపున తిరుపతి ఎంపీగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పోటీ చేసి ఓటమి చెందారు. కాగా ఈ ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా గెలిచిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ తెలంగాణలో బీజేపీ నుంచి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు.