హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారంటూ పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలకు స్వల్ప ఊరట లభించింది. సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ కింద ఆమెకు నోటీసులు ఇచ్చాకే విచారణ చేపట్టాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కఠిన చర్యలు చేపట్టవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. ఈ నెల 24న దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాలని ఆమెను ఆదేశించింది.