Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. ఒక సమావేశంలో ఆయన్ను ఆహ్వానిస్తున్న క్రమంలో హీరో బాలాదిత్య తడబడ్డాడు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి బదులు కిరణ్‌కుమార్ రెడ్డి పేరును ఉచ్ఛరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్ హైటెక్స్‌లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సినీ నటుడు బాలాదిత్య ఆహ్వానించారు. అప్పుడు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్‌కుమార్ గారు అంటూ ఉచ్ఛరించాడు. యాంకర్ నోటి నుంచి సీఎం కిరణ్‌కుమార్ అని రావడంతో సభ కింద ఉన్నవారంతా ఒక్కసారిగా కేకలు వేశారు. దీంతో తాను చేసిన తప్పును యాంకర్ గ్రహించాడు. ఆ వెంటనే తన తల పట్టుకుని స్టేజిపై నుంచి పక్కకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి తన క్షమాపణలు చెప్పాడు. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఉచ్ఛరించాడు.
మళ్ళీ ఘోర అవమానానికి గురైన తెలంగాణ ముఖ్యమంత్రి
తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి సీఎం కిరణ్ కుమార్ అంటూ పలికిన వైనం
త్వరలో జైలుకి వెళ్లనున్న మరో యాంకర్ అంటూ సెటైర్లు వేస్తున్న నెటిజన్లు https://t.co/vY2w4RJZ2O pic.twitter.com/GEaoPEjYZi
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2025
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తెలంగాణలో మరో యాంకర్ జైలుకు వెళ్లబోతున్నాడని పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. జాగ్రత్తగా ఉండు బ్రో అంటూ యాంకర్‌కు సలహాలు ఇస్తున్నట్లుగా కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే పుష్ప 2 ఈవెంట్లో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మరిచిపోవడంతోనే ఆయన్ను జైల్లో పెట్టారని అప్పట్లో నెటిజన్లు ఇలాగే ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.