హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : నిధుల కొరతతో ఎస్సీ స్టడీ సర్కిళ్లలో ఎలాంటి కోచింగ్‌లు ఇవ్వడం లేదని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేశ్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 ఎస్సీ స్టడీసరిళ్లలో సంవత్సరానికి రెండు బ్యాచ్‌లతో 2,400 మందికి ఉచితంగా కోచింగ్ ఇవ్వాల్సి ఉండగా.. దాదాపు 12 నెలలుగా ఎలాంటి కోచింగ్ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
ఉచిత కోచింగ్ అందుబాటులో లేకపోవడంతో ఎస్సీ విద్యార్థులు కాంపిటేషన్‌లో వెనుకబడే అవకాశంతోపాటు ఉద్యోగావకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్సీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వెంటనే నిధులు మంజూరు చేయించి ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.