మామిళ్లగూడెం, ఏప్రిల్ 27 : ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న కనతాల రమ్య(28) సైతం మృతిచెందడంతో ఖమ్మంలో ఆదివారం జరిగిన తండ్రీకూతురు మృతి మిస్టరీగా మారింది. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలో నివాసముంటున్న నేలకొండపల్లి మండలం బొదులబండకు చెందిన కనతాల రాము, పెద్దకూతురు దివ్య ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే.. అదే ఇంట్లో గడ్డిమందు తాగి అపస్మారక స్థితిలో ఉన్న రాము భార్య రమ్య, చిన్న కూతురును ద వాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రమ్య మృతిచెందింది. చిన్న కుమార్తె రితిక చికిత్స పొందుతున్నది. రాము, దివ్య, రమ్య ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. అంతకుముందు చికిత్స పొందుతున్న రమ్యను పోలీసులు విచారించగా.. కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని, శుక్రవారం కూడా గొడవ జరిగిందని, తె ల్లవారిన తర్వాత చూస్తే చనిపోయి ఉన్నాడని చెప్పిట్టు తెలిసింది. పెద్దకూతురు దివ్య ఎలా చనిపోయిందని రమ్యను ప్ర శ్నించగా ఎలాంటి సమాధానం చెప్ప లేదని సమాచారం. దీంతో ఈ కేసును పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు.