మెదక్ : ప్రభుత్వ దవాఖాన(Government hospital) ఆవరణలో కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్య మవడం స్థానికంగా కలకలం రేపింది. చేతికి గోలుసులతో బంధించి కాలిపోయిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని(unidentified dead body) చూసి రోగులు భయాందోళనలకు గురయ్యారు. ఈ సంఘటన మెదక్ జిల్లా(Medak Dist) చిన్నశంకరంపేటలో చోటు చేసుకుంది. రోగులు వెంటనే పోలీసులకు సమాచా రమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సం ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా హత్య చేసి తగలబెట్టారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
KTR | ఏడో బెటాలియన్లో కానిస్టేబుల్ భార్యల ఆందోళన.. సంఘీభావం ప్రకటించిన కేటీఆర్
KTR | ఈ రాష్ట్రంలో రైతుగోడు వినే నాథుడే లేడా..? కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన కేటీఆర్
KTR | ప్రజలు తిరస్కరించిన వారికి పాలన అప్పచెప్పడమేనా ఇందిరమ్మ రాజ్య అంటే..: కేటీఆర్