CM Revanth Reddy | హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీ కోసం మూడుసార్లు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో రెండుసార్లు అర్హ త సాధించా. ఈ ఏడాదిలో మూడోసారి నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించకపోవడంతో నాకు అన్యాయం జరిగింది. నా లాంటోళ్లకు అన్యాయం చేస్తారా’ అని కవిత అనే ఓ నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి, టీజీపీఎస్సీ సెక్రటరీకి ఆమె లేఖ రాసింది.
పాత గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ద్వారా పరీక్ష పెట్టడం వల్లే తాను మెయిన్స్ జాబితాలో అవకాశం కోల్సోవాల్సి వచ్చింది.. అని కవిత ఆ లేఖలో పేర్కొన్నది. అయితే ఈ విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని పూడ్చడానికి మానవతా కోణం లో ఆలోచించి 1:100 నిష్పత్తిని పాటించాలని కోరుతున్నది. రెండున్నరేండ్లుగా తీవ్ర మానసిక వేదనతో ఉన్నా.. అందువల్లే మూడోసారి పరీక్షలో అర్హత సాధించలేకపోయా’ అని ప్రభుత్వం దృష్టికి తెచ్చిం ది. ‘నాకు జీవితం పట్ల ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులను తీసుకొచ్చిన ప్రభు త్వ పనితీరుకు నేను బలి కావాల్సి వస్తున్నది’ అని పేర్కొన్నది. కనీసం మెయిన్స్ పరీక్షలు రాసి ఫెయిలైనా ఏదో సర్దిచెప్పుకునే వాళ్లమని, ఆ అవకాశం కూడా లే దు.. అని ఆవేదన వ్యక్తం చేసింది.