హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అబద్ధాల సీఎం అశోక్‌నగర్‌కు రా.. నేనే 65 వేల ఉద్యోగాలిచ్చానని అశోక్‌నగర్‌లో చెప్పు.. అని ఓ నిరుద్యోగి సోమవారం ఎక్స్ వేదికలో సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరాడు. 65 వేల ఉద్యోగాలు తానే ఇచ్చానని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి.. అశోక్‌నగర్‌కు వచ్చి అదే మాట చెప్పగలవా..? అని నిలదీశాడు. ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, చివరకు 65 వేలు అని చెబుతున్నావని విమర్శించాడు. ఆ 65 వేల ఉద్యోగాల్లో కేసీఆర్ ఇచ్చినవే 30 వేలకు పైగా ఉన్నాయని పేర్కొన్నాడు. గతంలో కేసీఆర్ నోటిఫికేషన్లు వేసి.. ఫలితాలు విడుదలయ్యాక కోర్టు కేసులతో ఆగిపోతే, ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలిచ్చి ఆ ఉద్యోగాలు నేనే ఇచ్చానని సిగ్గులేకుం డా చెప్పుకుంటున్నాడని మండిపడ్డా డు. ఏదో చేస్తావని భావించి.. నీకు ఓట్లేసి గెలిపిస్తే, ఇప్పుడేమో నిరుద్యోగులను లెకచేయడం లేదని నిరుద్యోగ యువకుడు నిప్పులు చెరిగా డు. ఈ వీడియో సోమవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్య లు చేపట్టింది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబి యా, యూఏఈలో పనిచేస్తున్న వా రిని గల్ఫ్ కార్మికులుగా గుర్తించింది. సోమవారం సీఎస్ శాంతికుమారి ఉ త్తర్వులు జారీ చేశారు. గల్ఫ్‌లో కార్మికులు మరణిస్తే వారి కుటుంబసభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నది. బాధితుల కోసం ప్రత్యేకంగా ప్రజావాణిలో ‘ప్రవాసి ప్రజావాణి’ పేరుతో కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నది.