Bayyaram | బయ్యారంలో విషాదం.. ఒక కుటుంబం.. 5 నెలలు.. 3 మరణాలు
కడదాకా తోడుంటాడునుకున్న భర్త, వృద్ధాప్యంలో కంటికిరెప్పలా కాపాడుతాడనుకున్న కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. వారి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ వృద్ధురాలు అకస్మాత్తు గా చనిపోయింది. ఐదు నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించటంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చోటుచేసుకున్నది.
- భర్త, కొడుకు మృతిని తట్టుకోలేక వృద్ధురాలి మృతి
Bayyaram | కడదాకా తోడుంటాడునుకున్న భర్త, వృద్ధాప్యంలో కంటికిరెప్పలా కాపాడుతాడనుకున్న కొడుకు అనారోగ్యంతో మృతిచెందారు. వారి మరణాన్ని తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ వృద్ధురాలు అకస్మాత్తు గా చనిపోయింది. ఐదు నెలల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించటంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చోటుచేసుకున్నది.
బయ్యారంలోని బొడ్రాయి బజార్‌కు చెందిన మాదిన రాములు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు. చిన్న తనం నుంచి కొడుకు శ్రీనును అల్లారుముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించాడు. కొడుకు సర్కారు కొలువు సాధించి కొత్తగూడ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తన కుటుం బం ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నదని అనుకుంటున్న క్రమంలోనే.. ఈ ఏడాది జనవరిలో మాదిన రాములు (68), ఏప్రిల్ 25న కొడుకు శ్రీను(38) ఇద్దరూ అనారోగ్యంతో మృతిచెందారు. కట్టుకున్న భర్త, కన్న కొడుకు నెలల వ్యవధిలోనే చనిపోవడంతో రాము లు భార్య పార్వతమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. శనివారం తెల్లవారు జామున పార్వతమ్మ(62) నిద్రలోనే మృతి చెం దింది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

