మహాముత్తారం, డిసెంబర్ 31: ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ఒక అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. ఒక్కో ఇంటికి రూ.500 చొప్పున లబ్ధిదారుల నుంచి వసూలు చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దౌత్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే టీఏ ప్రసాద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నది. ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న సదరు అధికారి ఒక్కో ఇంటికి రూ.500 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు వస్తుందని, లేదంటే రాదని భయపెట్టాడు. దీంతో ఆలం సమ్మక, తడండ్ల రజిత, పేరం సునీత, పొడెం రాజక, తడన్ల లక్ష్మి, కొప్పుల రమక, తడండ్ల రజిత, తడండ్ల మల్లయ్య, కుడిమోత మల్లయ్య, తడండ్ల పోశయ్య రూ.500 చొప్పున మొత్తం రూ.5,000 సర్వే అధికారి ప్రసాద్‌కు సోమవారం అందజేశారు. ఈ మేరకు బాధితులు మండల కేంద్రానికి వచ్చి ఎంపీడీవో శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఈవినతిపత్రాన్ని డీఆర్డీవోకు పంపించామని, వారి ఆదేశాల మేరకు విచారణ ఎంపీడీవో తెలిపారు.