ఆదిలాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై( Congress government) అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నది. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమ కారులపై ఉక్కుపాదం మోపుతున్నది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఆందోళనబాట పడుతున్నారు. తాజాగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కె) గ్రామస్తులు(Mukra(K) villagers )వినూత్న రీతిలో నిరసన(Innovative protest) చేపట్టారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానికులు లేఖలు రాశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. సాగు, తాగు నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ కాక అప్పులు పుట్టుక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.