తీవ్రంగా గాయపర్చి.. కండ్లల్లో పొడిచి
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ సమీపంలో ఆదివారం దారుణం చోటుచేసుకున్నది. ఓ యువతిని దుండగులు తీవ్రంగా గాయపరిచి, కండ్లు పొడిచి హత్య చేశారు. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జుట్టు శిరీష (19) వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్నది.
- కాళ్లాపూర్‌లో యువతి హత్య
పరిగి టౌన్, జూన్ 11 : వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ సమీపంలో ఆదివారం దారుణం చోటుచేసుకున్నది. ఓ యువతిని దుండగులు తీవ్రంగా గాయపరిచి, కండ్లు పొడిచి హత్య చేశారు. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జుట్టు శిరీష (19) వికారాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సుగా పనిచేస్తున్నది. శనివారం రాత్రి ఇంట్లో వంట విషయంలో బావ అనిల్ శిరీషను మందలించడంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగిరాలేదు.
ఆదివారం గ్రామ సమీపంలోని గోనె మైసమ్మ ఆలయం దగ్గర ఉన్న నీటి కుంటలో శవమై తేలింది. ఒంటిపై తీవ్ర గాయాలతోపాటు కండ్లను పొడిచినట్టు ఆనవాళ్లు ఉండటంతో హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. తన సోదరిని ఎవరో కొట్టి చంపారని శిరీష అన్న శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, సీఐ వెంకట్రామయ్య, ఎస్సై విఠల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. యువతి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

