Dog attack on boy | 18 నెలల బాలుడిపై వీధి కుక్క దాడి : వీడియో
Dog attack on boy | రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) స్వైర విహారం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభు త్వం పట్టించుకోకపోవడంతో రోజురోజుకు వాటి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి.
కరీంనగర్ : రాష్ట్రంలో వీధి కుక్కలు(Dog attacks) స్వైర విహారం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభు త్వం పట్టించుకోకపోవడంతో రోజురోజుకు వాటి బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా రోడ్లపై దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా వీధుల్లో సంచరిస్తూ ప్రజలపై పంజా విసురుతూ ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలోని(Karimnagar) శాతవాహన యూనివర్సిటీ సమీపంలో 18 నెలల బాలుడిపై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..శాతవాహన యూనివర్సిటీ సమీపంలో రోడ్డు మీద హరినందన్ అనే చిన్నారి మరో బాలుడితో కలిసి ఆడుకుంటున్నారు.
అయితే అదే సమయంలో హరినందన్ పై వీధి కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్ హాస్పిటల్లో చేర్పించారు. బాలుడిపై దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. కాగా, వీధికుక్కల నుంచి రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కుక్కల బెడద ఎక్కువ అవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవు తున్నారు. వీధి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
సీసీ ఫుటేజ్.. 18 నెలల బాలుడిపై వీధి కుక్క దాడి
కరీంనగర్ – శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని రోడ్డు మీద హరినందన్ మరో బాలుడు ఆడుకుంటున్నారు.. అయితే అదే సమయంలో హరినందన్ పై వీధి కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించారు. pic.twitter.com/2jvxwYiEGn
— Telugu Scribe (@TeluguScribe) August 8, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

