హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పరీక్ష హాల్టికెట్లను బుధవారం నుంచి https://www.tspsc. gov.in లో అందుబాటులో ఉంచనున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు.
ఈ నెల 28న 113 ఏఎంవీఐ పోస్టులకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని వివరించారు.