పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 10 : దేశాభివృద్ధికి నూతన ఆవిష్కరణలు అవసరం అని నీతి అయోగ్ పూర్వ సీఈవో అమితాబ్‌కాంత్ పేర్కొన్నారు. హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్పీపీ) నాలుగో స్నాతకోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నీతిఅయోగ్ పూర్వ సీఈవో, భారతదేశపు జీ-20 షెర్పా అమితాబ్‌కాంత్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న భారత్ ఆశయాన్ని సాధించడంలో యువ నిపుణులు కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అనంతరం గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌తో కలిసి 35 మంది పట్టభద్రులకు పట్టాలు, మెరిట్ పతకాలను ప్రదానం చేశారు.