హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ సిఖ్ విలేజ్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్న సోషల్ మీడియా వారియర్ల సమావేశానికి హాజరుకానున్నారు. ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొంటారు. సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగే సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాగా.. ఇటీవలే తెలంగాణలో పర్యటించిన ప్రధాని మరోసారి తెలంగాణ పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని సమాచారం.