హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, మనుస్మృతిని అమలు చేయాలనే కుట్రలో బీజేపీ నాయకత్వం ఉన్నదని ధ్వజమెత్తారు.
‘జై బాపు-జై భీమ్- జై సంవిధాన్’ పేరిట దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లేలా మోదీ, అమిత్ షా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయ స్వలాభం కోసం బీజేపీ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు.