బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 21:32:32

అమీర్ పేట ఎమ్మార్వోకు క‌రోనా పాజిటివ్

అమీర్ పేట ఎమ్మార్వోకు క‌రోనా పాజిటివ్

హైద‌రాబాద్ : న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ క‌రాళ నృత్యం చేస్తోంది. అమీర్ పేట ఎమ్మార్వో చంద్ర‌క‌ళ‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యులు తెలిపారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా.. ఎమ్మార్వోతో పాటు మ‌రో ముగ్గురు ఉద్యోగులు క‌లిసి మూడు రోజుల క్రితం క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఎమ్మార్వోకు క‌రోనా పాజిటివ్ రాగా, మిగ‌తా ముగ్గురికి నెగిటివ్ వ‌చ్చిన‌ట్లు డాక్ట‌ర్లు స్ప‌ష్టం చేశారు. దీంతో చంద్ర‌క‌ళ‌.. హోంక్వారంటైన్ లో ఉన్నారు. మిగ‌తా ఉద్యోగులు కూడా హోంక్వారంటైన్ లో ఉండాల‌ని వైద్యులు సూచించారు.  ఎమ్మార్వో ఆఫీసును శానిటేష‌న్ చేస్తున్నారు. ఏసీబీ కేసులో షేక్ పేట త‌హ‌సీల్దార్ సుజాత అరెస్టు అయిన విష‌యం విదిత‌మే. దీంతో షేక్ పేట ఇంచార్జి ఎమ్మార్వోగా చంద్ర‌క‌ళ విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. logo