అంబర్ పేట, జూన్ 23: జీహెచ్ఎంసీ అంబర్‌పేట సర్కిల్-16, వార్డు-2 అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న టీ మనీషా బిల్లు మంజూరు చేయడానికి కాంట్రాక్టర్ వద్ద రూ.15000 లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీ హైదరాబాద్ రేంజ్-1 యూనిట్ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
సోమవారం కాంట్రాక్టర్ ఏఈ మనీషాకు రూ.5వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ మనీషాపై కేసు నమోదు చేసి, కోర్టులో రిమాండ్ చేశారు. కాగా, ఏఈ మనీషా ఇప్పటికే ఒకసారి ఏసీబీ అధికారులకు పట్టబడటం గమనార్హం.