కురవి, ఏప్రిల్ 14: ఆవిషరణకు సిద్ధం చేసిన అంబేదర్క్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండలో సోమవారం రాత్రి చోటేచేసుకున్నది. కందికొండలో మూడున్నర సంవత్సరాల క్రితం దళిత సంఘాల నాయకులు అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినా.. వివిధ కారణాల వల్ల ఆవిషరణ జరగలేదు. అంబేదర్ జయంతి సందర్భంగా సర్పంచ్ నాగార్జున ఆధ్వర్యంలో విగ్రహావిషరణకు ఏర్పాట్లు చేపట్టారు. ప్రభుత్వ విప్ రాంచంద్రూనాయక్ చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిషరించేందుకు నిర్ణయించారు. మంగళవారం ఉదయం ఏర్పాట్ల కోసం వచ్చిన గ్రామస్తులు, దళిత సంఘాల నాయకులు విగ్రహం ధ్వంసమైన విషయం గుర్తించి ఆందోళన వ్యక్తంచేశారు. సీరోలు ఎస్సై సంతోష్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. విగ్రహ ధ్వంసాన్ని సీపీఎం, తెలంగాణ గిరిజన సంఘాల నాయకులు ఖండించారు. నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పోలీసులు, గ్రామస్తులు చర్యలు తీసుకున్నారు.