హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాల్సిందేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ న్యాయమైన డిమాండ్ సాధనకు టీఆర్ఎస్ కట్టుబడి ఉన్నదని తెలిపారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటోను ముద్రించడంతోపాటు గణతంత్ర దినోత్సవాల్లో ఆయన ఫొటో పెట్టాలని డిమాండ్ చేస్తూ అంబేదర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరుశురామ్ ఢిల్లీ వరకు జ్ఞాన యుద్ధ యాత్ర చేపట్టారు. ఈ నెల 26న యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ప్రారంభమైన ఈ యాత్ర మంగళవారం హైదరాబాద్ చేరుకున్నది. అనంతరం సమితి నేతలు వినోద్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఆయనతో కలిసి అంబేదర్ చిత్ర పటాలను ఆవిషరించారు. కార్యక్రమంలో సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి, సురేశ్ మహాజన, బీ రవి, జోగు మురళి, బొల్లం లక్ష్మణ్, సురేశ్ మహాజన, తెరల సందీప్, కే మచ్చగిరి, మధు, కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.