కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి : వినోద్ కుమార్
కరెన్సీ నోటుపై అంబేద్కర్ | కరెన్సీ నోటుపై భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

హైదరాబాద్ : కరెన్సీ నోటుపై భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ కమిటీ ప్రతినిధులు శుక్రవారం మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని వినోద్ కుమార్ ను కమిటీ ప్రతినిధులు కోరారు .
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలన్న కమిటీ ప్రతినిధుల డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని టీఆర్ఎస్ ఎంపీలకు ఆయన సూచించారు. దేశంలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని, అలాంటి మహానీయున్ని గౌరవించుకోవడం కనీస బాధ్యత అని వినోద్ కుమార్ అన్నారు.
కమిటీ చేపట్టిన ఆగస్టు 3,4,5 తేదీలలో ‘చలో ఢిల్లీ’ వాల్ పోస్టర్‌ను బోయినపల్లి వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆ కమిటీ జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం, నాయకులు స్వామి, నర్సింహులు, ఆశీర్వాదం, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పసిబిడ్డను పొట్టనబెట్టుకున్న అమ్మమ్మ
డ్రైవర్ లేకుండానే నడిచిన ట్రాక్టర్.. వీడియో
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
ఆ పథకాలన్నీ గత బడ్జెట్‌లోనివే : గుత్తా సుఖేందర్ రెడ్డి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

