సీఎం కేసీఆర్‌కు అంబేద్కర్ ఫొటో సాధన సమితి విజ్ఞప్తి
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటోను ముద్రించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి కోరింది. సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ శుక్రవారం ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. బీఆర్ అంబేద్కర్ 1923లో రాసిన పుస్తకం ఆర్బీఐ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిందని ఆయన సీఎంకు నివేదించారు. తమ విజ్ఞప్తికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.