దేవరుప్పుల, ఏప్రిల్ 14: జనగామ జిల్లా దేవరుప్పులలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం పోలీసుల నిర్బంధం మధ్య ఎట్టకేలకు ఆవిష్కరణ జరిగింది. విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించగా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు చౌరస్తాలో మోహరించారు.
ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే యశస్వినీరెడ్డిని పిలవాలని విగ్రహ కమిటీకి తెలిపారు. విగ్రహదాత మాజీ మంత్రి ఎర్రబెల్లితో ఆవిష్కరణ ఉంటుందని కమిటీ చెప్పగా పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఎట్టకేలకు అంబేద్కర్ విగ్రహాన్ని ఎర్రబెల్లి ఆవిష్కరించారు.