Ambedkar Statue | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసల పరంపర కొనసాగుతుంది. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో డాక్టర్ బీఆర్ అంబేంద్కర్ విగ్రహం నమోదైంది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను సీఎం కేసీఆర్ పేరు మీద మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సమర్పించారు.
హైరెంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం స్థానం పొందటం అభినందనీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దేశ, విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెబుతున్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలోనే అంబేద్కర్ విగ్రహం టూరిజం స్పాట్‌గా మారుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞశర్మ, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్, హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్స్ శ్రీకాంత్, సుమన్ పల్లె తదితరులు పాల్గొన్నారు.