కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి
ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని కరె న్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ విజ్ఞప్తి చేశారు.
- అసెంబ్లీలో ప్రస్తావించాలని కేటీఆర్‌కు వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత బీఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని కరె న్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గురువారం అ సెంబ్లీ ఆవరణలో వినతిపత్రం అందజేశారు.
1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు ‘రూపాయి దాని సమస్య పరిషార మార్గం’ అనే అంశంపై పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్, రాయల్ కమిషన్, సైమన్ కమిషన్‌కు అంబేద్కర్ ఇచ్చారని, దాని ఫలితంగానే 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడిందని గుర్తుచేశారు. అంబేదర్ లేకుంటే ఆర్బీఐనే లేదని పేర్కొన్నారు. తన వినతిపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బెంజిమెన్, కాశీం, అనిల్, రవికుమార్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

