హైదరాబాద్ : డా.బీఆర్ఎస్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Ambedkar Telangana Secretariat)లో అమెజాన్ ప్రతినిధులు(Amazon representatives) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సమావేశమయ్యారు. సమావేశంలో తెలంగాణలో అమెజాన్ పెట్టుబడుల గురించి అమెజాన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు.