హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): వచ్చే మార్చి కల్లా అల్వాల్ టిమ్స్ పనులు పూర్తి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు. అల్వాల్ టిమ్స్ పనులను సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూనే.. నిర్దేశించిన సమయానికి పనులను పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
నేడు సౌతిండియా వీసీల కాన్ఫరెన్స్
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : సౌతిండియా యూనివర్సిటీ వైస్చాన్స్లర్ల కాన్ఫరెన్స్ మంగళవారం హైదరాబాద్‌లో జరుగనున్నది. నల్సార్ యూనివర్సిటీలో జరిగే ఈ సదస్సుకు దక్షిణాది రాష్ర్టాల వైస్చాన్స్లర్లు హాజరు కానున్నారు.